- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
గూడ్స్ రైలులో చెలరేగిన మంటలు
దిశ, జడ్చర్ల : బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది స్టేషన్లో గూడ్స్ రైలు ఆపివేయడంతో.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ఘటన జడ్చర్ల రైల్వే స్టేషన్ లో గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కాజీపేట నుంచి బొగ్గు లోడుతో రాయచూరు వెళ్తున్న గూడ్స్ రైలులో వెనుక నుంచి మంటలతో పాటు పొగలు వస్తుండగా..జడ్చర్ల రైల్వే అధికారులు గమనించి రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలును నిలిపివేశారు. వెంటనే జడ్చర్ల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో..అగ్నిమాపక సిబ్బంది మంటలతో పాటు పొగలను ఆర్పి వేశారు. అయిన పొగలు అలాగే వస్తుండడంతో మరోసారి ఫైర్ ఇంజన్ లో నీళ్లు తీసుకువచ్చి..బోగిలోకి నీళ్లను వదిలి మంటలను పొగలను పూర్తిగా అర్పేశారు. కాగా ఉదయం ఇదే గూడ్స్ ట్రైన్ లో శంషాబాద్ వద్ద మంటలు చెలరేగడం..అక్కడ అగ్నిమాపక సిబ్బంది రైల్వే అధికారులు మంటలను ఆర్పినట్లు..? సమాచారం మళ్లీ అదే గుర్తులో జడ్చర్ల వద్ద చేరుకోగానే మంటలు పొగలు వెదజల్లడంతో రైల్వే అధికారులు గూడ్స్ రైలు ముందుకు అనుమతించాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.