మొసలి కలకలం.. రాత్రంతా నిద్రకు కరువైన గ్రామస్థులు

by Disha Web Desk 21 |
మొసలి కలకలం.. రాత్రంతా నిద్రకు కరువైన గ్రామస్థులు
X

దిశ, రాజోలి : రాజోలి గ్రామంలోని బుధవారం అర్ధరాత్రి భారీ మొసలి హల్‌చల్ చేసింది. గ్రామంలోకి ప్రవేశించిన మొసలి అక్కడే వీధుల్లో తిరుగుతూ స్థానికులకు భయాందోళనకు గురిచేసింది. రాత్రంతా కంటికి నిద్ర లేకుండా స్థానికులు మొసలి సంచారాన్ని గమనిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మత్స్యకారుల సాయంతో మొసలిని పట్టుకొని తాళ్లతో బంధించారు. ఉదయం రాజోలి గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు మొసలిని సుంకేసుల జలాశయంలో వదిలిపెట్టారు. కాలువలు, జలాశయాల సమీపాన ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story