తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా 21రోజుల ఉత్సవం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా 21రోజుల ఉత్సవం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా దశాబ్ది ఉత్సవాల 21 రోజుల పాటు గొప్పగా పండుగను చేసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా స్థానిక శిల్పారామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యుత్ విజయోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో రైతులకు నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో మన విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి కరెంట్ కష్టాలను తీర్చారని ఆయన తెలిపారు.

రాష్ట్రం ఏర్పడినాక కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతో పాటు ట్రాన్స్ ఫార్మర్లు, నూతన విద్యుత్ లైన్లు వేయడం వల్ల విద్యుత్ ప్రమాదాలను అరికట్టామని, లో వోల్టేజీ సమస్య తీర్చడంతో పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవి నాయక్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గోపాల్ యాదవ్, మల్లు నరసింహారెడ్డి, ఎస్ఈ రామ్మూర్తి, విద్యుత్ యూనియన్ కార్యదర్శి సాయిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, ఏఈ షకీల్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed