హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవి లత.. ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే

by Disha Web Desk 12 |
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవి లత.. ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శనివారం 195 మందితో కూడిన మొదటి జాబితాను ప్రకటించారు. ఇందులో తెలంగాణ నుంచి 9 మందికి స్థానం దక్కగా అందులో ఒవైసీ కంచుకోటగా చెప్పుకునే ఒవైసీపై సమాజ సేవకురాలు, విరంచి చైర్మన్ మాధవి లతను పోటీలోకి దించారు. కాగా తనకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడంపై మాధవి లత స్పంధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘గత 8 ఏళ్లుగా చూస్తున్నా.. పరిశుభ్రత, చదువు లేదు.. మదర్సాల్లో పిల్లలకు తిండి దొరకడం లేదు.. దేవాలయాలు, హిందూ గృహాలు.. అక్రమంగా ఆక్రమించుకున్నారు.

ముస్లిం పిల్లలు చదువుకోలేదు, బాలకార్మికులు ఉన్నారు. వారికి చదువు, భవిష్యత్తు లేదు. కానీ వారిని కేవలం ఓ పార్టీ తమకు అనుకూలంగా అల్లర్లు చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఓల్డ్ సిటీ హైదరాబాద్ మధ్యలో ఉంది కానీ అక్కడ పేదరికం కూడా అధికంగానే ఉంది. ఓల్డ్ సిటీ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి పార్లమెంట్‌కు పంపితే.. వారి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని మాధవి లత చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మాధవి లతకు బీజేపీలో కనీసం సభ్యత్వం కూడా లేదు. అలాంటిది ఆమెను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడంతో అంతా ఆశ్చర్యానికి గురి అయినప్పటికి.. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఓల్డ్ సిటీలో ఒవైసీని దెబ్బకొట్టేందుకు బీజేపీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు.


Next Story

Most Viewed