యువగళంకు ఎన్టీఆర్ ఆశీస్సులు.. నేడు ఎన్టీఆర్ ఘాట్‌కు లోకేష్

by Disha Web Desk |
యువగళంకు ఎన్టీఆర్ ఆశీస్సులు.. నేడు ఎన్టీఆర్ ఘాట్‌కు లోకేష్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్టీఆర్ ఘాట్‌కు బుధవారం టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ రానున్నారు. యువగళం పాదయాత్రను ఈ నెల 27నుంచి ఏపీలో చేపడుతున్న లోకేష్ యాత్ర విజయవంతానికి తాతా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకొని నివాళుర్పించనున్నారు. యాత్ర 400 రోజుల పాటు 4వేల కిలో మీటర్లు సాగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు జూబ్లీహిల్స్‌లోని స్వగృహం నుంచి రోడ్డు మార్గంలో లోకేష్ బయల్దేరి1.45 గంటలకు ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుంటారు. ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు బయల్దేరి 3.15 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 3.30 గంటలకు విమానంలో 4.30 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా సాయంత్రం 5.10 గంటలకు దేవునికడపలోని శ్రీ వేంకటేశ్వరస్వామి టెంపుల్‌కు చేరుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి గంగపేటలోని అమీన్ పీర్ దర్గాకు సాయంత్రం 5.40 గంటలకు చేరుకొని ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం 6.15 గంటలకు మరియాపురంలోని రోమన్ కేథలిక్ క్యాథడ్రల్ చర్చీలో లోకేష్ ప్రార్థనలు చేయనున్నారు. రాత్రి పది గంటలకు తిరుమలలోని జీఎంఆర్ గెస్ట్ హౌజ్‌కు చేరుకుంటారు. అక్కడ బస చేస్తారు. ఈ నెల 26న వేంకటేశ్వరస్వామి దర్శనం చేరుకుంటారు. మధ్యాహ్నం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో గల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ కు చేరుకుంటారు. ఈ నెల 27న కుప్పం నుంచి యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

నేడు బైక్ ర్యాలీ..

లోకేష్ పాదయాత్రకు మద్దతుగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నుంచి తెలుగుయువత బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీ ఖైరతాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకొని అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోంది. ఈ ర్యాలీలో టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ కంభంపాటి రాంమోహన్ రావు, పార్టీ శ్రేణులు, తెలుగుయువతనాయకులు పాల్గొంటున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

Also Read...

గుంటూరు జిల్లా టీడీపీలో ముసలం

Read Disha E-paper

Next Story

Most Viewed