ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా లోకల్ రైళ్లు.. తప్పిన పెను ప్రమాదం

by Disha Web Desk 4 |
ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా లోకల్ రైళ్లు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : మలక్‌పేట రైల్వే‌స్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి ఒకే ట్రాక్ పైకి ఎదురెదురుగా రెండు లోకల్ రైళ్లు వచ్చాయి. అప్రమత్తం అయిన లోకో పైలట్లు రైళ్లకు బ్రేకులు వెయ్యటంతో ప్రమాదం తప్పింది. అరగంటపాటు రెండు రైళ్లు అలాగే ట్రాక్‌పై ఉండిపోయాయి. అనంతరం అధికారులు ఓ రైలును కాచిగూడ స్టేషన్ వైపు పంపించి ట్రాక్ మార్పించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, ఇలాంటి సంఘటన జరగలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.

Next Story

Most Viewed