'రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం బదిలీలు చేపట్టాలి'

by Disha Web |
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం బదిలీలు చేపట్టాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 ప్రకారమే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని లోకల్ కేడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శికి సంఘం నేతలు వినతి పత్రం అందించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2018పై న్యాయస్థానంలో స్టే ఉందని, కావున గతంలో ఉమ్మడి సర్వీస్ నిబంధనల పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చేపట్టాలని వారు పేర్కొన్నారు. వినతి అందించిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరాచారి, న్యాయ సలహాదారు సురేందర్, ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ ఉన్నారు.

'ఉత్తములకు' పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎక్స్ ట్రా పాయింట్స్ కేటాయించాలి..

తెలంగాణ ప్రభుత్వం 2015లో జరిగిన బదిలీల్లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన టీచర్లకు 'పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఎక్స్ ట్రా పాయింట్స్' ను కేటాయించిందిని, కాగా ఇప్పుడు చేపట్టే బదిలీల్లోనూ దీన్ని కేటాయించి ఉత్తములుగా అవార్డు పొందిన ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంపొందించేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కావలి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు బుధవారం వినతిపత్రం అందజేసినట్లు వారు తెలిపారు.


Next Story