- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముందు పాపను కాపాడుకుందాం.. నేనున్నా!
ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, ఖమ్మం రూరల్: ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి, హత్యాయత్నం ఘటనపై తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘాతుకం తనను తీవ్రంగా కలచివేసిందని, నిందితుడిపై తక్షణమే కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
బాధితులకు పూర్తి అండ..
విషయం తెలిసిన వెంటనే మంత్రి పొంగులేటి బాధిత బాలిక తండ్రితో, స్థానిక సర్పంచ్‌తో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. "ముందు మన పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా" అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పాప వైద్య ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి పొంగులేటి భరోసానిచ్చారు.






