BRS పేరుతో డ్రామాలు.. కేసీఆర్ జాతీయ పార్టీపై లక్షణ్ విమర్శలు

by Disha Web Desk |
BRS పేరుతో డ్రామాలు.. కేసీఆర్ జాతీయ పార్టీపై లక్షణ్ విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఎన్నికల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త విన్యాసాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం అని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు నూకలు చెల్లాయని, అందుకే బీఆర్ఎస్ పేరుతో మరో డ్రామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన ఎనిమిదేళ్ల పాలనతో తెలంగాణలో సాధించినదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణను అప్పుల ఊబిలోకి తీసుకుపోయారని, రేపు దేశానికి తెలంగాణ మోడల్ అంటే ఏం చెబుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ విధానం ఏంటో మందు ప్రజలకు చెప్పాలని అన్నారు. అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేయాలనుకోవడం? లిక్కర్ పాలసీని దేశానికి విస్తరింపజేయడం బీఆర్ఎస్ విధానమా అని ప్రశ్నించారు. రైతులకు శాపంగా మారిన ధరణి పోర్టల్ దేశానికి ఆదర్శమా? లేక అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని దేశంలో ఏర్పాటు చేయడమా? ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న 317 జీవోను దేశమంతటా అమలు చేయడమా? ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడమా? బీఆర్ఎస్ విధానం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అనేది రాజకీయ నిరుద్యోగులకు, కాలం చెల్లిన నేతల ఏకీకరణకు మాత్రమే తప్ప దేనికి పనికి రాదంటూ లక్ష్మణ్ సెటైర్లు వేశారు. జాతీయ పత్రికలు, టీవీలకు తప్పుడు ప్రకటనలు ఇస్తూ దేశ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.



Next Story

Most Viewed