‘లహరి’తో చిల్ అవ్వడమే! టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 14 |
‘లహరి’తో చిల్ అవ్వడమే! టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైటెక్‌ హంగులతో రూపొందించిన లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేట్‌ ట్రావెల్ బస్సులకు దీటుగా ఈ బస్సులను రూపొందించారు. ఈ క్రమంలోనే టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. వేసవిలో చల్లదనం అందించే టీఎస్ ఆర్టీసీ లహరి- ఏసీ స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నాగ్ పూర్, షిరిడీ, సత్తుపల్లి, తదితర మార్గాల్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు. కాగా, ఈ ట్వీట్ నెటిజన్లు స్పందిస్తున్నారు. లహరి బస్సులు బాగున్నాయని, కానీ బస్సుల్లో స్పేస్ తక్కువగా ఉండటంతో కొంత అసౌకర్యానికి లోనవుతున్నట్లు ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరోవైపు వరంగల్ నుంచి నిజమాబాద్ రూట్‌లో ఏసీ సర్వీస్‌లు నడిపించాలని ఓ నెటిజన్ కోరారు. కాగా, అత్యధునిక ఏసీ స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభూతి’ అని టీఎస్ ఆర్టీసీ గతంలో నామకరణం చేసింది.

Next Story

Most Viewed