ఫెడరేషన్ అఫ్ కల్చురీ అసోసియేషన్స్ చైర్మన్‌గా కుమార్ గౌడ్

by samatah |
ఫెడరేషన్ అఫ్ కల్చురీ అసోసియేషన్స్ చైర్మన్‌గా కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో వివిధ పేర్లతో పిలువబడుతున్న గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించిన అన్నింటిని ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ఏర్పడిన ఫెడరేషన్ అఫ్ కల్చురీ అస్సోసియేషన్స్ చైర్మన్ గా తెలంగాణకు చెందిన గౌడ్స్ క్లబ్ వ్యవస్థాపకుడు వి కుమార్ గౌడ్ నియమితులయ్యారు. న్యూ ఢిల్లీ లోని డిఫెన్స్ కాలనిలో గల ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఈ ఎన్నిక గురువారం సాయంత్రం జరిగింది. 2013 ఫెడరేషన్ ఆఫ్ కల్చురీ అసోసియేషన్ ఏర్పాటైంది. మొదటి అధ్యక్షుడుగా బసంత్ లాల్ షా నియమితులయ్యారు. అనారోగ్య కారణాలతో బసంత్ లాల్ షా గురువారం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. దీంతో యావత్ భారతదేశంలో గౌడ్ సామాజిక వర్గం పైన పూర్తిస్థాయి అవగాహన కల్గిన వి కుమార్ గౌడ్ ని చైర్మన్ గా ప్రతిపాదించారు. గౌడ్స్ క్లబ్స్ ద్వారా కుమార్ గౌడ్ దశాబ్ద కాలంగా చేస్తున్న సేవలను గుర్తించి ఫెడరేషన్ అఫ్ కల్చురీ అసోసియేషన్స్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వి కుమార్ గౌడ్ మాట్లాడుతూ చైర్మన్ గా తనను ఎన్నుకున్నందుకు ప్రతినిధులందరికి ధన్యవాదాలు తెలిపారు.

దేశవ్యాప్తంగా పర్యటించి గౌడ్స్ సామాజికవర్గానికి చెందిన అహ్లువాలియా, జైస్వాల్స్, నాడార్స్, ఎజువా, ఈడిగ, శెట్టిబలిజ, శ్రీశయన, యాత, బిల్వా, బండారి, నాయక్, షౌన్డిక్, కల్వార్, సొంధి, మేవార్, టాక్ , గుప్తా తదితర పేర్లతో పలు రాష్ట్రాల్లో పిలువబడుతున్న అందరిని ఏకతాటిపైకి తీసుకొస్తానని చెప్పారు. వారి సమస్యలను తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేస్తానని తెలిపారు. ఆల్ ఇండియా పామ్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వున్నా 8 కోట్ల గౌడ్స్ సామాజిక వర్గానికి సంబంధించిన అందర్నీ కలిపి 6 నెలల్లో జాతీయ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. జాతి అభివృద్ధి, రాజకీయ వాటా, విద్య తదితర అంశాలపై అజెండాగా ఈ సమావేశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణ గౌడ్ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, భారతీయ కల్చురీ జైస్వాల్ సంవర్గ్ మహాసభ అధ్యక్షుడు లాల్ చాంద్ గుప్తా, మాజీ అధ్యక్షుడు వేద్ కుమార్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed