అసలు నిజాలు బయటపెడతాం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
అసలు నిజాలు బయటపెడతాం.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లా నేరళ్లపల్లిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) పర్యటించారు. ఈ సదర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. సర్వే నెంబర్ 523లో ఇళ్ల కూల్చివేత దారుణమన్నారు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చిందని.. ఇప్పుడు ఆ పట్టాలున్న ఇళ్లనే ఆక్రమణల పేరుతో కూల్చివేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తక్షణమే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని అన్నారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. త్వరలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌(Palamuru-Rangareddy Project) యాత్ర చేపడుతామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ యాత్రలోనే పాలమూరు బిడ్డలకు అసలు నిజాలు తెలియజేస్తామని చెప్పారు. చరిత్రలో రేవంత్ రెడ్డి లాంటి సీఎంలను చాలామందిని చూశామని ఎద్దేవా చేశారు. తాము చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి వారితోనే కొట్లాడామని వారి కింద రేవంత్ రెడ్డి ఎంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు.

Next Story

Most Viewed