నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి KTR... కఠిన చర్యలు తీసుకుంటామని హామీ

by Dishanational1 |
నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి KTR... కఠిన చర్యలు తీసుకుంటామని హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ నగరంలోని సరస్సుల ఆక్రమణలపై అనేకమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫ్యూచర్ ఫౌండేషన్‌ సొసైటీ కూడా ఆ జాబితాలో చేరింది. ఈ సొసైటీకి చెందిన సచిన్ అనే వ్యక్తి సరస్సు ఏ విధంగా ఆక్రమణకు గురైందో తెలుపుతూ ఫొటోలతో సహా ట్వీట్ చేశారు. ట్వీట్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి కేటీఆర్, హైదరాబాద్‌ కలెక్టరేట్, రంగారెడ్డి కలెక్టరేట్‌లను ట్యాగ్ చేశాడు. లోధా కమ్యూనిటీ ముందు ఉండే ఆ సరస్సుకు పక్షులను చూసేందుకు తాను రెగ్యులర్‌ గా వెళ్లేవాడినని, 6 నెలల తర్వాత చూస్తే అది ఆక్రమణకు గురైనట్లు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి వేళల్లో ఆ ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్నాయని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని వివరించాడు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ నేపథ్యంలో శనివారం సచిన్ చేసిన ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఆక్రమణలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వానికి వెంటనే రిపోర్టు ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్‌ను కేటీఆర్ ఆదేశించారు.


Next Story

Most Viewed