- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
‘మమ్మల్ని ఎవరూ ఆపలేరు’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ హెచ్చరిక
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు అండగా నిలబడుతూనే ఉంటామని అన్నారు. మమ్మల్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ‘మీ తాటాకు చప్పుళ్ళకి భయపడను. మీ తాట తియ్యడానికి వచ్చాను. నీ పిల్లి కూతలకి భయపడేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో. బడుగు బలహీనుల గొంతులను నీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవు. నీ గుండా రాజ్యాన్ని... నియంతృత్వ పాలనను సవాలు చేసే నా స్ఫూర్తిని నీ గుండాలు ఆపలేరు. నీ గుండాలు నా వాహనంపై చేసిన దాడి నాకు మరింత శక్తిని ఇస్తుంది. ఇట్లాంటివి మమ్మల్ని ఆపలేవు’ అని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చారు.
Advertisement
Next Story