కిషన్‌రెడ్డి ఓటమి ఖాయం: కేటీఆర్

by srinivas |
కిషన్‌రెడ్డి ఓటమి ఖాయం: కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో గెలిచేది గులాబీ పార్టీనేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అంబర్‌పేట్‌లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఓటమి ఖాయమన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదని విమర్శించారు. మరోసారి హైదరాబాద్ నగర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్‌కి మద్దతు ఇవ్వాలని కోరారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పద్మారావు గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed