ఎన్నికలే లక్ష్యంగా గులాబీ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు

by GSrikanth |
ఎన్నికలే లక్ష్యంగా గులాబీ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. గట్టిగా పోరాడితేనే ఎన్నికల్లో విజయం సాధించగలమని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని అన్నారు. అవి ఆరు గ్యారంటీలు కాదని.. 420 హామీలు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

హామీల అమలుపై ఇప్పటికే కాంగ్రెస్ మాట దాటవేస్తోందని ఎద్దేవా చేశారు. అప్పులు, శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునేందుకు కాంగ్రె నేతలకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే గృహలక్ష్మి కార్యక్రమాన్ని రద్దు చేసిందని గుర్తుచేశారు. దళితబంధుపైనా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed