కాంట్రవర్సీగా KTR ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలు.. విశ్వ హిందూ పరిషత్ సంచలన రియాక్షన్

by Disha Web Desk 4 |
కాంట్రవర్సీగా KTR ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలు.. విశ్వ హిందూ పరిషత్ సంచలన రియాక్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గో హాంతకులు (ఏఐఎంఐఎం)తో రాజకీయ జట్టు కట్టిన వారికి ఏం తెలుసు జైశ్రీరామ్ విలువ అని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మండిపడ్డారు . బుధవారం అయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ‘జైశ్రీరామ్’ నినాదం కూడు పెట్టదు ఉద్యోగం ఇవ్వదని వ్యాఖ్యానించడాన్ని అయన తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

తన పేరులోనే (తారక రామారావు) రాముడు ఉన్నప్పటికీ ఆ దేవుడి గొప్పతనం తెలుసుకోకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఇకనైనా రాజకీయ అవసరాల నిమిత్తం జైశ్రీరామ్ నినాదాన్ని వివాదంగా మార్చడం బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి నిదర్శనం జైశ్రీరామ్ అన్నారు. కూటి కోసమో, కూలి కోసమో, కడుపు నింపుకునేందుకు కోసమో చేసే నినాదం కాదన్నారు. రాజకీయాలు.. కులాలు.. ప్రాంతాలు.. వర్గాలకు అతీతంగా ఆరాధించే దైవం శ్రీరాముడని అలాగే జపించే మంత్రం జైశ్రీరామ్ అని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడి హృదయాంతరాలలో ప్రతిధ్వనించే తారక మంత్రం జైశ్రీరామ్ అన్నారు.


Next Story

Most Viewed