KTR: ‘హైడ్రా’ను నడిపిస్తుంది సీఎం రేవంత్ కాదు.. అతడే: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Shiva |
KTR: ‘హైడ్రా’ను నడిపిస్తుంది సీఎం రేవంత్ కాదు.. అతడే: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో హైడ్రా (HYDRA)ను నడిపిస్తుంది సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కాదని.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీకి డబ్బు సంచులను మోసేందుకే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతోందని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే నిరుపేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి నోట్ల కట్టలే కావాలని.. నిరుపేదల కష్టాలు ఏమాత్రం పట్టవని ఆరోపించారు. మూసీ సుందరీకరణ అంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్, ప్రాజెక్ట్ రిపోర్టును ఇంకా రూపొందించలేదని ధ్వజమెత్తారు. అసలు మూసీ సుందరీకరణ డబ్బు ఎక్కడి నంచి వస్తుందో.. ఎలా చేస్తారో తాను రెండు, మూడు రోజుల్లో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తానని స్పష్టం చేశారు. సీఎం, మంత్రులకు మధ్య సయోధ్య లేనట్లుగా కనిపిస్తోందని, ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ కూడా చేయలేని అసమర్ధ ప్రభుత్వమని కేటీఆర్ అన్నారు.

Advertisement

Next Story