నేడు మునుగోడుకు KTR.. ఆ హామీలన్నీ నెరవేరుస్తారా..?

by Disha Web Desk 19 |
నేడు మునుగోడుకు KTR.. ఆ హామీలన్నీ నెరవేరుస్తారా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు బైపోల్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మంత్రుల బృందం గురువారం మునుగోడుకు వెళ్తుంది. అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించి నివేదికను కేసీఆర్‌కు అందజేయనున్నారు. గెలిచిన మరుసటి రోజే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని కేసీఆర్ పేర్కొన్నప్పటికీ 24నాలుగు రోజులు గడించింది. నియోజకవర్గ ప్రజలకు ఏయే హామీలు ఇచ్చారు.. ఏ మండలానికి ఏ మంత్రి, ఎమ్మెల్యే హామీలు ఇచ్చారనేదానిపైనే చర్చించి ఎన్ని నిధులు అవసరం అవుతాయనే దానిపై ఒక నిర్ణయానికి రానున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని, వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మునుగోడును దత్తత తీసుకొని సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ మాట ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చండూరు మున్సిపాలిటీని దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు మంత్రి జగదీష్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, టెంపుల్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాటి అమలుకు కేసీఆర్ మంత్రుల కమిటీ వేశారు. ఆ కమిటీలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఉన్నారు.

గురువారం ఉదయం9 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరి 11 గంటలకు మునుగోడుకు మంత్రుల బృందం చేరుకోనుంది. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు మునుగోడు అభివృద్ధిపై రివ్యూ సమావేశంను ధనలక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి తిరిగి 4 గంటల వరకు ప్రగతి భవన్ చేరుకోనున్నారు. ఈ సమావేశంలో అభివృద్ధి పనుల పూర్తికి ఎస్టిమేషన్ తయారు చేయనున్నారు. కేసీఆర్ కు నివేదికను అందజేయనున్నట్లు సమాచారం.

రెవెన్యూ డివిజన్ ఊసేది..?

గెలిచిన తర్వాత 15 రోజుల్లోనే చండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 24 రోజులు గడిచిన జీవో విడుదల కాలేదు. చండూరు, మునుగోడు, గట్టుప్పుల్, నాంపల్లి, మర్రిగూడ మండలాలతో కొత్త డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా చండూరులో వంద పడకల ఆసుపత్రికి సంబంధించిన జీవో కూడా విడుదల కాకపోవడం శోఛనీయం.


Next Story

Most Viewed