యూకే పర్యటనలో కేటీఆర్ బిజీబిజీ

by Disha Web Desk |
యూకే పర్యటనలో కేటీఆర్ బిజీబిజీ
X

దిశ, తెలంగాణ బ్యూరో :యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. రెండోరోజూ గురువారం థామస్ లాయిడ్, పియర్సన్ కంపెనీ, హెచ్ఎస్బీసీ, గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వంతో పని చేసేందుకు కంపెనీల ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ లో 710 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు గ్లాక్సో స్మిత్ క్లైన్ కన్స్యూమర్ హెల్త్ కంపెనీ అధికారులు వెల్లడించారు. 125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, గత రెండేళ్లలోనే దాదాపు 340 కోట్ల రూపాయలను హైదరాబాద్ ఫార్మాలో పెట్టుబడిగా పెట్టామన్నారు.

హైదరాబాద్ లోని తమ సేఫ్టీ , రెగ్యులేటరీ విభాగం ద్వారా విస్తరణ అవకాశాలను మరింత పెంచుకుంటామని కంపెనీ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ హెడ్ ఫ్రాంక్ రాయట్ తెలిపారు. అనంతరం క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ ఛాన్స్లర్ పోల్లార్డ్ లతో భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి ఏరోనాటికల్ యూనివర్సిటీ తెలంగాణ కేంద్రంగా తీసుకువచ్చే తమ ప్రయత్నంలో కలిసి రావాలని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ బృందానికి విజ్ఞప్తి చేశారు. పలు కార్యక్రమాల్లో థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తుల్లీ, హెచ్ఎస్బీసీకి చెందిన పాల్ మెక్ పియార్సన్, బ్రాడ్ హిల్ బర్న్ , ప్రియార్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed