కొండగట్టు : లోపల ఎంక్వైరీ.. బయట ఆందోళన

by Disha Web Desk 4 |
కొండగట్టు : లోపల ఎంక్వైరీ.. బయట ఆందోళన
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో అర్ధరాత్రి అగంతకులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జగిత్యాల డిఎస్పి రత్నాపురం ప్రకాష్ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇప్పటివరకు సుమారు 15 కిలోల వెండి, ఉత్సవ విగ్రహాలు రెండు ఎత్తుకెళ్లినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అయితే సంఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తిస్థాయిలో పోలీసులు కొనసాగిస్తున్నారు. ఆలయంలోకి భక్తులు వస్తే అగంతకులకు సంబంధించి ఆనవాళ్లు లభ్యం కావని, అలాగే క్లూస్ టీంకు వేలి ముద్రలు కూడా దొరికే అవకాశం లేదని భావించిన పోలీసులు ఆలయంలో దర్శనానికి అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపున ఆలయ అర్చకులు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంప్రోక్షణ పూర్తి అయిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు.

భక్తుల ఆందోళన

మరోవైపున సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ మాల ధారణ చేసుకున్నవారు. చాలాసేపటి నుంచి వేచి చూస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఏపీకి చెందిన మహిళా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అంజన్న క్షేత్రం చేరుకోగా దర్శనానికి అనుమతి ఇవ్వడం లేదని ఆలయం ముందు కూర్చుని భజనలు చేయడం మొదలుపెట్టారు.

Read More... కొండగట్టు : ముగిసిన ఆలయ సంప్రోక్షణ

Next Story