రేవంత్ రెడ్డి 'హోంగార్డు' కామెంట్స్ పై కోమటిరెడ్డి వినూత్న నిరసన

by Disha Web Desk |
TPCC Chief Revanth Reddy Says Sorry to MP Komatireddy Venkat Reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : రేవంత్ రెడ్డి క్షమాపణలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడం శుభపరిణామం అన్నారు. అద్దంకి దయాకర్ వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి.. సీనియర్ నేతనైనా తనను అనవసరంగా దూషించారని, దాని వల్ల పార్టీతో పాటు నాయకుల పరువు కూడా పోతుందని అన్నారు. తనను దూషించిన వారిని పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరిస్తారని అన్నారు. అలాంటి వారిని పార్టీ అధిష్టానం ప్రోత్సహించదని స్పష్టం చేశారు. తనను సంప్రదించకుండానే కాంగ్రెస్ పెద్దలు కమిటీ వేశారని, మునుగోడు వైపు వెళ్లబోనని అన్నారు. తనపై అద్దంకి దయాకర్ చేసిన కామెట్స్ పై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశలో రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దాంతో ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. అద్దంకి దయాకర్ సైతం కోమటిరెట్టి వెంకట్ రెడ్డికి క్షమాపణలు కోరారు. రేవంత్ క్షమాపణల విషయం తనకు తెలియదని తొలుత చెప్పిన వెంకట్ రెడ్డి తాజాగా ఇది మంచి సంకేతమని అన్నారు.

రాజీనామాకు సిద్ధం

మునుగోడుకు ఉప ఎన్నిక ఖాయం అయిన నేపథ్యంలో వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేస్తే అభివృద్ధి అవుతుందంటే తాను రాజీనామా చేస్తానన్నారు. మునుగోడు ఎన్నికలు సెమీ ఫైనల్ అని అన్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన 'హోంగార్డు' కామెంట్స్ పై వెంకట్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ బయోలో తాను కాంగ్రెస్ పార్టీ హోంగార్డునని వెంకట్ రెడ్డి మార్చడం సంచలనంగా మారింది. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ హోంగార్డుగా పని చేస్తున్నట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేసిన హోంగార్డు వ్యాఖ్యలపై రచ్చ కొనసాగుతూనే ఉంది.Next Story