కేంద్రంలో, ఏపీలో అధికారం ఆ పార్టీలదే.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
కేంద్రంలో, ఏపీలో అధికారం ఆ పార్టీలదే.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర రాజకీయాలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ బీజేపీనే రాబోతోందని టాక్ నడుస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లో ఏం జరుగబోయేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. అనంతరం ఏపీ రాజకీయాలపైనా కీలక స్పందించారు. ఏపీలో కాంగ్రెస్ ఓట్లు చీల్చితే వైసీపీకే లాభం జరగుతుందని అన్నారు.

వైసీపీకి ప్రభుత్వ లబ్ధిదారుల ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజగోపాల్ రెడ్డి కేంద్రంలో, ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని పరోక్షంగా చెప్పిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పట్టులేని ఏపీ గురించి మాట్లాడితే పర్వాలేదు కానీ.. కేంద్రంలో ఇండియా కూటమి ఓటమి ఖాయమని ఆయన చెప్పిన పరోక్ష వ్యాఖ్యలు సరికాదని మండిపడుతున్నారు. ఒకవేళ అవకాశం లేకపోయినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపాల్సింది పోయి.. బీజేపీ గెలుపు ఖాయమని సంకేతాలు పంపడం కరెక్ట్ కాదని అంటున్నారు.


Next Story