తెలంగాణలో రూ.10 వేల కోట్ల భారీ స్కామ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

by Disha Web Desk 19 |
తెలంగాణలో రూ.10 వేల కోట్ల భారీ స్కామ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుటంతో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఓ పక్క ప్రచారం హోరెత్తిస్తున్న ఎంపీ అభ్యర్థులు మరోవైపు ప్రత్యర్థులపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. నేతల విమర్శలు, సవాళ్లు, కౌంటర్లతో స్టేట్ పాలిటిక్స్ హీటెక్కాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్‌లో రూ.10 వేల కోట్ల స్కామ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.

ఇందులో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెయ్యికోట్ల అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయన అక్రమాలపై విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు సుస్థిరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed