హైదరాబాద్ లోని ఫాం హౌస్‌లో కోడి పందేలు.. భారీ క్యాసినో మిషన్ సీజ్

by Mahesh |
హైదరాబాద్ లోని ఫాం హౌస్‌లో కోడి పందేలు.. భారీ క్యాసినో మిషన్ సీజ్
X

దిశ, చేవెళ్ల, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఆంద్రప్రదేశ్ తో పాటు దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ జిల్లాల్లో కోడి పందేలు (Kodipandalu) పండుగ వాతావరణం జరుపుతుంటారు. ఈ కోడి పందేలు (Kodipandalu) ఇల్లీగల్ (ఇల్లీగల్) అయినప్పటికి ఆనవాయితీగా వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరిస్తుంది. అయితే సంక్రాంతి తర్వాత ఈ కోడి పందేలు ఎక్కడ కనిపించవు. కానీ మంగళవారం రాత్రి ఏకంగా హైదరాబాద్ నగర శివారు (Suburb of Hyderabad city)లో ఉన్న ఓ ఫాం హౌస్‌ (farm house)లో భారీ ఏర్పాట్లు చేసి.. కోడి పందేలు, భారీ క్యాసినో నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు (police) ఆ ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని పట్టుకున్నారు. ఈ రైడ్ లో భాగంగా భారీ క్యాసినో (Huge casino) కూడా పట్టుకున్నట్లు తెలుస్తుంది. అలాగే 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు సీజ్ (cars Seize) చేశారు.ఈ కోడి పందెం కోసం తీసుకొచ్చిన 86 పందెం కోళ్ళు.. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ (Betting Coins), పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రనగర్ డిసిపి పార్టీ (Rajendranagar DCP Party) అధికారులు తెలిపారు. కాగా ఈ వ్యవహారం మొత్తాన్ని ఓ రాజకీయ పార్టీ (political party)కి చెందిన నేత నిర్వహించినట్లు తెలుస్తుండగా.. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story