తెలంగాణ కేసీఆర్ అబ్బ జాగీరు కాదు

by Disha Web Desk 7 |
Kishan Reddy Regrets Over firing In Secunderabad Railway Station
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేసీఆర్ అబ్బ జాగీరు కాదని 4 కోట్ల మంది ప్రజల సొంతం అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతల సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కిషన్ రెడ్డి వెనకడుగు వేశారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాపై కేటీఆర్ అర్థం లేని విమర్శలు చేస్తున్నాడని సకల జనుల సమ్మెకు రాకుండా ఈ అయ్య ఎందుకు పారిపోయాడో కేటీఆర్ అడగాలని డిమాండ్ చేశారు. సాగరహారంలోకి ఎందుకు రాలేదో ప్రశ్నించాలన్నారు. బీజేపీకి కార్యకర్తలు, ప్రజలే గురువులని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మాత్రం ఓవైసీ గురువు అని విమర్శించారు.

24 గంటల నిరాహార దీక్ష విరమణ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. ధర్నాచౌక్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తే మీకు కలిగే ఇబ్బంది ఏమిటని నిలదీశారు. 9 ఏండ్లుగా మీరిచ్చిన హామీలను నెరవేర్చమంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలను భర్తీ చేసే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ఖాళీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల పేపర్లు లీకులు అయ్యాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నెలకు 80 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తుందని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.

Read More: లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

ఈ సీఎం మాకొద్దు.. జనాగ్రహంలో టాప్‌లో నిలిచిన కేసీఆర్

Next Story

Most Viewed