ప్రాజెక్టులకు ఎక్కడ అడ్డు పడ్డానో నిరూపిస్తే రాజీనాకు సిద్ధం.. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి చాలెంజ్

by Prasad Jukanti |   (  Updated:2026-06-09 12:09:09  IST  )

సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హామీల వైఫల్యం నుంచే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రాజెక్టులకు ఎక్కడ అడ్డు పడ్డానో నిరూపిస్తే రాజీనాకు సిద్ధం.. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి చాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, వ్యక్తిగతంగా తనపై దాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అభద్రత, అహంకారం, నిరాశ, నిస్పృహలతో నామీద తప్పుడు ప్రచారం చేస్తూ సంస్కార హీనంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దయాదాక్షిణ్యాలతో బీజేపీ కేంద్రంలో అధికారంలో లేదన్నారు. నేను అంబర్ పేట, సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో తాను ఢిల్లీ వరకు వచ్చానని తానేమి రేవంత్ రెడ్డికి జవాబుదారిని కాదని తాను తెలంగాణ ప్రజలు, సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు, బీజేపీ పార్టీకి జవాబుదారీనన్నారు. అంతే రేవంత్ రెడ్డి మాదిరిగా ప్రతి నేల రాహుల్ గాంధీ వద్ద హాజరు వేసుకున్నట్లు నేనేం ఎవరికి గులాంగిరి చేయడం లేదన్నారు.

చర్చకు ఎక్కడికి వస్తారో రండి:

తెలంగాణ అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో ఎవరు తనకు కలిసినా సానుకూలంగా స్పందిస్తానన్నారు. తనకు రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదని ఆయన సర్టిఫికేట్ కోసం నేను ఇక్కడ పని చేయడం లేదన్నారు. తనపై ఆరోపించినట్లు ఏ ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించేందుకు హైదరాబాద్ నుంచి పంపిస్తారా లేదా ఢిల్లీలో ఉన్న వారినే పంపిస్తా సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పంపించాలన్నారు. నేను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు జర్నలిస్టుల కమిటీ నివేదిక ఇస్తే రాజీనామా చేయడానికి తాను సిద్ధం అని చాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డిలా నేను చిల్లర మాటలు మాట్లాడనని రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడే వ్యక్తిని నేను కాదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికి చర్చకు వస్తావో రావాలని ప్రెస్ క్లబ్ కు వస్తారా లేదా అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తారో రావాలని చర్చకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి అప్పుల కుప్పగా మార్చాయన్నారు. ఈ రెండు పార్టీలు ఒకే రకమైన దోపిడీకి పాల్పుతున్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తననే ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. తుమ్మిడి హట్టి విషయంలో అపాయింట్ మెంట్ ఇవ్వకుండా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడ్డుకుంటున్నదని కిషన్ రెడ్డే అని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ అపాయింట్ మెంట్ కావాలంటే అడగాలన్నారు. మెట్రో ఫేజ్- 2 కు కేంద్రం సూత్రప్రాయకంగా అగీకారం తెలిపిందన్నారు.

Next Story