ఉన్న సమయం అంతా మంచినీటి కోసమే వేచిచూడాల్సి వస్తోంది... మరి పనికెప్పుడు పోవాలి?

by Dishanational1 |
ఉన్న సమయం అంతా మంచినీటి కోసమే వేచిచూడాల్సి వస్తోంది... మరి పనికెప్పుడు పోవాలి?
X

దిశ, కూసుమంచి: ప్రతి ఇంటికి మంచినీటి సమస్య తీర్చాలానే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కూసుమంచి మండల కేంద్రంలో గత 15 రోజులుగా మంచినీటి సమస్య విలయతాండం చేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామంలోని పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఆర్సియం చర్చి పరిధిలోని పలువురు మహిళలు ఖాళీ బిందెలతో విధుల వెంట నిల్చోని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గ్రామపంచాయతీ అధికారులకు, గ్రామ సర్పంచ్ కి పలుమార్లు విన్నవించినప్పటికీ ఇంతవరకు చర్యలు చేపట్టడంలేదని ఆరోపించారు. ప్రతి రోజు మంచినీటి సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ, వీధులలో చేతిపంపులపై ఆధారపడుతూ ఉప్పునీటినే తాగుతున్నామంటూ గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న సమయం అంతా మంచినీటి కోసమే వేచిస్తున్నామని కూలీనాలి పనులకు కూడా సమయానికి వెళ్ళలేకపోతున్నమన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పదించి మంచినిటి సమస్యను తీర్చాలని కొరారు.

పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్ వివరణ

గ్రామ పంచాయితీ కార్యదర్శి గోదాల శంకర్, సర్పంచ్ చెన్న మోహన్ రావు లను వివరణ కోరగా నీటి కొరత ఉన్న విషయం నిజమే అయిన్నప్పటికీ తమ వంతుగా పైపు లైన్ మరమ్మత్తు పనులు పూర్తి చేశామని, పై నుండి అందించే మిషన్ భగీరథ నీటి సరఫరా తక్కువ అందుతుందని తెలిపారు.

మిషన్ భగీరథ ఏఈ వసంత్ వివరణ

మిషన్ భగీరథ నీటిని గ్రామంలో ప్రతి రోజుకి ఒక్కొక్క మనిషికి 100 లీటర్ల చొప్పున కూసుమంచి గ్రామానికి మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రతి రోజు అందిస్తున్నామన్నారు.



Next Story