మందుబాబులను దోచుకుంటున్న వైన్స్ యజమానులు

by Sumithra |
మందుబాబులను దోచుకుంటున్న వైన్స్ యజమానులు
X

దిశ, కరకగూడెం : మండల కేంద్రంలోని వైన్‌షాపులో మద్యం ఎమ్మార్పీ ధరలకు అమ్మే నిబంధన అమలు కావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మండలంలో వున్నా శివమ్ వైన్ షాపు దోపిడీలకు ప్రజలు బంబేలేత్తుతున్నారు. వైన్ షాపుల్లో రెగ్యులర్ గా దొరికే మద్యాన్ని అమ్మకుండా, బెల్టు షాపులవారికి అధిక ధరలో అమ్ముకుంటున్నారని మందుబాబుల ఆవేదన. వైన్ షాపు ఓనర్ అండదండలతో గ్రామగ్రామాన బెల్ట్ షాపులు వెలిసాయని ప్రజలు ఆక్రోషం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారికి నచ్చిన షాపులకు సరఫరా...

కొన్ని బెల్ట్ షాపులు పగలనక రాత్రి అనకా 24/7 అనే సూక్తులతో ముందుకెళ్లిపోతున్నారు. మండలంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉంటే అన్ని బెల్ట్ షాపుల్లో వైన్ షాపు వాళ్ళు నిర్దేశించిన రేటుకే అమ్మమని ఆర్డర్లు వేస్తున్నారు. ఇదేంటి అని అడిగిన మద్యానికి బానిస అయిన పేద, మధ్యతరగతి ప్రజలకు డబ్బులు ఉంటే తాగండి, లేకుంటే మూసుకోండి అని సమాధానం ఇస్తున్నారని మద్యం బాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాపు నిర్వాహకులు బెల్టు షాపులకు మందు విక్రయించేందుకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. కస్టమర్స్​​కు నేరుగా అమ్మితే ఎమ్మార్పీ ధర వస్తుందని అదే బెల్టు షాపునకు అయితే ఎమ్మార్పీకి మించి అమ్మొచ్చనే ఉద్దేశ్యంతో వైన్​షాపు నిర్వాహకులు ఈ పనిని ఎక్కువుగా ఎంచుకుంటున్నారు. వైన్​షాపుల్లో మామూలు లిక్కర్​ ఉంచి.. బెల్టుషాపులకు బ్రాండెడ్ మందును సప్లయ్​ చేస్తున్నారు. పేరున్న బ్రాండ్ లను క్వార్టర్ బాటిల్ పై రూ.20 నుంచి రూ. 30 వరకు ఫుల్ బాటిల్ పై 80 -100 వరకు ఎక్కువ రేటుకు బెల్టు షాపులకు పంపిస్తున్నారు.

వాళ్లు మరో రూ.20 లాభం చూసుకొని కస్టమర్లకు ఇస్తున్నారు. షాపునకు వచ్చిన కస్టమర్లకు మాత్రం అడిగిన బ్రాండ్ లేదని, ఇతర బ్రాండ్ లకు చెందిన సీసాలను అంటగడుతున్నారు. దీంతో కొన్ని సార్లు షాపులో సిబ్బందితో కస్టమర్లు గొడవకు దిగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మండలంలో మంచి నీళ్లు దొరకని గ్రామాలు వున్నాయి అంటే నమ్మొచ్చు గాని మద్యం దొరకని గ్రామాలు ఉండవనేది జగమెరిగిన సత్యం. ప్రతి షాప్ లో మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్ల మద్యం ప్రియులు ఎక్కడ పడితే అక్కడ తాగి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామస్తులు కూడా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వైన్ షాప్‌లో దొరకని బ్రాండ్ మందు బెల్ట్ షాప్‌లో దొరకడం ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ బీర్లు అమ్మకుండా బెల్టుషాపులకు తరలించి ఒక్కో బీర్ కు రూ.210-230 వరకు అమ్ముతూ మద్యం ప్రియులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం మద్యం దుకాణాల యజమానుల వద్ద లంచాలు తీసుకుని ఏదీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. షాపునకు వచ్చిన కస్టమర్లకు మాత్రం అడిగిన బ్రాండ్ లేదని, ఇతర బ్రాండ్ లకు చెందిన సీసాలను అంటగడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వైన్స్ షాపు నిర్వాహకుడి పై దృష్టిసరించాలని పలుసంఘాలు కోరుకుంటున్నారు. సంబంధిత జిల్లా అధికారులు ఇటువంటి వారి పై తగు చర్యలు తీసుకుంటారని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story

Most Viewed