- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అకాల వర్షం.. అపార నష్టం

దిశ, కూసుమంచి : అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. దీనితో రైతులు అపార నష్టానికి గురయ్యారు. కూసుమంచి మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం తీవ్రనష్టం కలిగించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. పలుచోట్ల బీటీ రోడ్ల మీద ధాన్యం అరబోసిన చోట వరదకు కొంత మేర కొట్టుకపోయాయి. వారం రోజుల్లో కోతకు వచ్చిన వరిపొలాలు వర్షానికి నేలవాలాయి. చేతికందవచ్చిన ధాన్యం తడవడం, కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతానికి తడిసిన వడ్లు ఎండితే ఎటువంటి సమస్య లేదని వరసగా మరల రెండోసారి వర్షం వచ్చి ఇదే విధంగా తడిస్తే అరబోసిన ధాన్యం మొలకేత్తే అవకాశం ఉందని రైతులు అయోమయంలో ఉన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు.
ఎటువంటి కొర్రిలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి...
బీజేపీ నాయకుడు గుండా.ఉపేందర్ రెడ్డి, కూసుమంచి, పాలేరు తదితర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతుల తరుపున బీజేపీ పార్టి అండగా ఉంటుందని రైతులకు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు కల్పించలేదని, రైతులకు కావాల్సిన టార్పాలిన్లు సరిపోను అందుబాటులో ఉంచకపోవడం, వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాటాలు వేసి లోడింగ్ చేసి పంపించకపోవడంతో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని, తడిసిన ధాన్యాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.