పాలేరుపై బీజేపీ జెండా ఎగరవేస్తాం : సంకినేని వెంకటేశ్వరరావు

by Sridhar Babu |
పాలేరుపై బీజేపీ జెండా ఎగరవేస్తాం :  సంకినేని వెంకటేశ్వరరావు
X

దిశ, ఖమ్మం రూరల్​ : పాలేరు గడ్డ పై బీజేపీ జెండా ఎగరవేయడానికి బీజేపీ నాయకులు సైనికుల్లా పని చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాససభ్యులు సంకినేని వెంకటేశ్వర రావు అన్నారు. ఎదులాపురం పరిధిలో గల బీజేపీ క్యాంపు కార్యాలయంలో సొమవారం పాలేరు అసెంబ్లీ స్థాయి శక్తి కేంద్ర ఇంచార్జి ల సమావేశం జరిగింది.ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి తో ఉన్న ప్రజలు బీజేపీ ని ప్రత్యామ్నాయం గా భావిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మద్యం ద్వారా 45 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని దండుకుంటూ, మహిళ ల పుస్తెలు తెంపుతుందని ఎద్దేవా చేశారు. రైతు బంధు ఇస్తున్నామని గొప్పలు చెపుతున్న కేసీఆర్ లక్ష రూపాయల రుణ మాఫీ హామీ ని అమలు చేయలేదన్నారు. ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన తెలంగాణ లో అమలు చేయడం లేదని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ లో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని ప్రజలు భావిస్తున్నారని, ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు ప్రతి పోలింగ్ బూత్ కు వెళ్లి కమిటీలు వేయాలన్నారు. బీజేపీ తెలంగాణ లో అధికారం లోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందుబాటులో కి తెస్తామని స్పష్టం చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ 7వ తేదీన టీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం పాలేరు అసెంబ్లీ పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనం జయప్రదం చేయాలని కోరారు. పాలేరు ప్రభారీ ఎడ్ల అశోక్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ కమిటీలు వెంటనే పూర్తి చేసుకోవాలన్నారు. పాలేరు అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుండా శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఆనంతు ఉపేందర్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు చావా కిరణ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుదర్శన్, నకిరీకంటి వీరభద్రం, బీజేపీ మండల అధ్యక్షులు బట్టు నాగరాజు, మన్నే కృష్ణా రావు, మల్లా రెడ్డి, బొడ్డిపల్లి ప్రసాద్, సీనియర్ నాయకులు కన్నేటి కోటయ్య, భావనసి దుర్గారావు, షరీఫ్ ఉద్దీన్, మండల ప్రధాన కార్యదర్శులు సాగర్, వెంకన్న, ప్రభాకర్, రాశాల రవి, బీజేవైఎం మండల అధ్యక్షులు బోడ ప్రకాష్ జాదవ్, లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed