పాలేరు రిజర్వాయర్ ను సాగర్ జలాలతో నింపుతాం : సీఈ

by Sridhar Babu |
పాలేరు రిజర్వాయర్ ను సాగర్ జలాలతో నింపుతాం :  సీఈ
X

దిశ, కూసుమంచి : మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్ ను, నాయకన్ గూడెం గ్రామం వద్ద సాగర్ ఇన్ ఫాల్ రెగ్యులేటర్ ను నీటిపారుదల శాఖ సీఈ శంకర్ నాయక్, ఈ ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ఖమ్మం జిల్లాలో తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ నుంచి నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాగర్ జలాలు పాలేరు రిజర్వాయర్ కు చేరాయి. సాగర్ నుండి 3వేల క్యూసెక్కుల నీరు వస్తుందని, పాలేరు రిజర్వాయర్ ను సాగర్ నీటితో నింపుతామని అన్నారు.



Next Story