- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఊరు నుంచి ఎంతో తీసుకున్నాం తిరిగి ఇచ్చేయండి.. డీహెచ్ శ్రీనివాసరావు ఆసక్తికర వాఖ్యలు..

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కొత్తగూడెం వచ్చి మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. కొత్తగూడెంలో జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగా జాబ్ మేళా సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై గడల మాట్లాడుతూ.. కొత్తగూడెం నాకు జన్మను ఇచ్చింది కాబట్టి నేను సేవా రూపంలో కొత్తగూడెంకు తిరిగి ఇస్తాను అన్నారు. కొత్తగూడెంకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఈ ప్రయత్నాలు చేస్తున్నానని, కొత్తగూడెం నుంచి చాలా మంది చాలా తీసుకున్నారు. వారందరూ కూడా కొత్తగూడెంకు తిరిగి ఇవ్వాలి, లేకపోతే ఇచ్చేలా చేద్దాం అన్నారు. ఈ మధ్య కొందరు మమ్మల్ని టూరిస్టులు అని పిలుస్తున్నారని ఈ ప్రపంచంలో మనుషులందరూ టూరిస్టులే ఎవరూ శాశ్వతం కాదు అంటూ కొందరిని ఉద్దేశించి కౌంటర్ విసిరారు.
నేను ఇక్కడే పుట్టాను కాబట్టి ఈ మట్టి రుణం తీర్చుకొనేందుకు మాత్రమే ఈ సేవా కార్యక్రమాలు తప్ప, తనకు వేరే ఏ ఉద్దేశం లేదని, ఏదైనా రావాలి అని రాసి ఉంటే అదే వస్తుందని అన్నారు. తాను చేపట్టిన కార్యక్రమం విజయవంతం కాకుండా చాలామంది అడ్డుపడే ప్రయత్నం చేశారని ఎంతమంది అడ్డుపడినా దాన్ని ఎవరూ ఆపలేరు అంటూ సభా వేదికగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి.