తమ్మినేని క్రిష్ణయ్య హత్య కేసులో దర్యాప్తుపై పలు అనుమానాలు ఉన్నాయ్​: బీజేపీ

by Dishafeatures2 |
తమ్మినేని క్రిష్ణయ్య హత్య కేసులో దర్యాప్తుపై పలు అనుమానాలు ఉన్నాయ్​: బీజేపీ
X

దిశ, ఖమ్మం రూరల్​ : తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో దర్యాప్తు సరిగా లేదని, పలు అనుమానాలు ఉన్నాయ్​ అని బీజేపీ లీగల్​ సెల్​ కమిటీ కన్వీనర్​ అంటొని రెడ్డి అన్నారు. శనివారం రూరల్​ మండలం గత నెల 15న హత్య చేయబడిన టీఆర్​ఎస్​ నాయకుడు తమ్మినేని క్రిష్ణయ్య కుటుంబాన్ని బీజేపీ స్టేట్​ లీగల్​ టీమ్​ సభ్యలు పరామర్శించి క్రిష్ణయ్యకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లొంగిపోయిన నిందితులను కస్టడీలోకి కూడా తీసుకోలేదని ప్రశ్నించారు.

కృష్ణయ్య కుటుంబం స్వతంత్ర సంస్థకు ఈ కేసును ఇవ్వమని కోరుతుందని తప్పకుండా సీబీఐ ఎంక్వైయిరీ కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తామని, అవసమైతే సెంట్రల్​ హోం మంత్రిత్వశాఖకు కూడా విషయాన్ని తెలిపి వారి కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. తమ టీమ్ కూడా తప్పకుండా సీబీఐ ఎంక్వైరీ కోరుతుందన్నారు. నిజాలు నిగ్గు తేలే వరకు తాము ఈ కేసుపై దృష్టి సారిస్తాం అని తెలిపారు.

తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఈ కేసుపై నివేదిక ఇస్తామని తెలిపారు. వచ్చే నెల 10 వరకు కోర్టుకు సెలవులు​ ఉన్నాయని, కాబట్టి ఆ తరువాత పిటిషన్​ వేస్తామని అన్నారు. ఈ మర్డర్​లో పెద్ద పెద్ద పొలిటికల్ నాయకుల ప్రమేయం ఉండటం వల్ల ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యానారయణ, శ్రీనివాస్​గౌడ్​, శ్రీకాంత్​ గౌడ్​, డీ. శ్రీనివాసరావు, గడ్డం గణేష్​, కటకం శారవ, కృష్ణ, అనన్య, వనం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.​


Next Story