- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
జిల్లాలో ఐదుకు.. ఐదు స్థానాలు మనవే

సోషల్ మీడియాలో ప్రభుత్వ విప్ రేగా పోస్టులు
దిశ, మణుగూరు: రాబోయే సాధారణ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో ఐదు స్థానాల్లో విజయ దుంధుభి మోగిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పలు సోషల్ మీడియాలో ఆదివారం కొన్ని పోస్టులు పెట్టారు. స్థానిక నాయకుల మధ్య విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటామని అన్నారు. యువకులదే భవిష్యత్తు అని, బూత్ కమిటీ సమావేశాల్లో ముందున్న మణుగూరు నాయకులను సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ప్రశాంతంగా ఉన్న అశ్వారావుపేటను ఆగం చేసేందుకు నాయకులు వస్తున్నారని, ప్రజలు వారందరికీ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ మీద గౌరవం ఉన్న వారు ఎవరూ కూడా పార్టీ వ్యతిరేక సమావేశాలకు హాజరు కాకూడదని తెలిపారు. మరోసారి మన ప్రభుత్వమే అధికారంలోకి రానుందని తెలిపారు.