- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చిన్నారి ఆపరేషన్ కు వీ కేర్ సాయం

దిశ, కారేపల్లి : పుట్టుకతోనే మాటలు రాక, వినికిడి లోపంతో అవస్థలు పడుతున్న చిన్నారి వైద్యానికి వీ కేర్ సంస్థ ముందుకు వచ్చి సాయం అందించి తమ దాతృత్వాన్ని చాటుకుంది. కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామానికి చెందిన పొనుగోటి శివ, మహేశ్వరీ ల పెద్ద కుమార్తె (3) కు మాటలు రాక, వినికిడి లోపం తో అవస్థలు పడుతుంది. తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా పరీక్షించిన వారు సర్జరీ ద్వారా లోపాలను సరి చేయవచ్చని, దానికి రూ.6 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు.
పేద కుటుంబం కావటంతో ఆ కుటుంబం సీఎం రీలిఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా దాని ద్వారా రూ. 4.50 లక్షలు సమకురాయి. మిగతా పైకం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన వీ కేర్ సంస్థ ప్రతినిధులు రూ.70 వేలు సాయం చేయటానికి ముందు వచ్చారు. వీ కేర్ సంస్థ సభ్యుడి మిత్రులు గౌరవ్ శర్మ, చరణ్‌ప్రిత్ సింగ్ కలిసి రూ.60 వేలు సమకూర్చారు. మొత్తం పైకం రూ.1.30 లక్షలను బుధవారం చిన్నారి తల్లిదండ్రులు పొనుగోటి శివ, మహేశ్వరీల కు అందజేశారు. చిన్నారి ఆపరేషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. దీంతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందం వ్యక్తం చేశారు.