ఆదివాసీ గ్రామాల నీటి సమస్య పరిష్కారం

by Sridhar Babu |   ( Updated:2023-05-27 15:07:42.0  )
ఆదివాసీ గ్రామాల నీటి సమస్య పరిష్కారం
X

దిశ, ములకలపల్లి : ఈ నెల 19న ఆదివాసీల అరిగోస అనే శీర్షికతో దిశలో రచన్నగూడెం పంచాయతీలో వలస ఆదివాసీలు నీళ్ల కోసం పడుతున్న బాధలపై కథనం ప్రచురితమైంది. దాంతో అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. ఆ గ్రామంలో ఉన్న సోలార్ పంప్ రిపేర్ కోసం కొన్ని రోజులుగా అధికారులు ప్రయత్నం చేశారు. అది విఫలం కావడంతో శనివారం స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓలు ఆ గ్రామంలో ప్రస్తుతం ఉన్న సోలార్ స్థానంలో చేతి పంపు అమర్చి ఆదివాసీల తాగునీటి అవసరాన్ని తీర్చారు. స్థానిక సర్పంచ్ గణపతి చేతి పంపు అమర్చే పనులు పర్యవేక్షించారు. ఎట్టకేలకు ఆదివాసీలకు వేసవిలో నీటి అవసరం గురించి కథనం ప్రచురించిన దిశ పేపర్కు, అధికారులకు, స్థానిక సర్పంచ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.



Next Story