17.7 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్ నీటిమట్టం

by Sridhar Babu |
17.7 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్ నీటిమట్టం
X

దిశ, వైరా : మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్ నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 17.7 అడుగులకు చేరింది. ఈ రిజర్వాయర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి ఇంకా కేవలం అరఅడుగు దూరంలో ఉంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులుగా ఉంది. సోమవారం వరకు 16 అడుగులుగా ఉన్న నీటిమట్టం అర్థరాత్రి రిజర్వాయర్ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఏర్లు, వాగుల నుంచి భారీగా వరదనీరు రిజర్వాయర్ లోకి వచ్చిచేరడంతో ఒక్కసారిగా నీటిమట్టం పెరిగింది.

వైరాలో 63.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. పరీవాహక ప్రాంతం నుంచి ఇంకా భారీగా రిజర్వాయర్ కు వరదనీరు వచ్చిచేరుతుండటం, మరోవైపు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుందటంతో రిజర్వాయర్ కు ఇంకా భారీగా వరదనీరు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అష్టగుర్తి , వల్లాపురం గ్రామాల సమీపంలోని రాళ్ల వాగు పొంగి ప్రవహిస్తుంది. నల్లచెరువు వాగు, గంగదేవిపాడు వాగు వరదలతో ప్రవహిస్తున్నాయి.



Next Story

Most Viewed