- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రేపు పొంగులేటి గూటికి విజయబాయి

దిశ, వైరా: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గూటికి ఆదివారం బానోత్ విజయబాయి చేరనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైరా సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన విజయబాయి మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపు నిలిచారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో శ్రీనివాసరెడ్డి అభ్యర్థిగా బానోత్ విజయబాయి పేరును ఇప్పటికే ఖరారు చేశారు. అయితే, ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆమెను అధికారికంగా తన వర్గంలోకి చేర్చుకునేందుకు పొంగులేటి నిర్ణయించారు. ఆదివారం ఉదయం 7.30లకు ఆయన సమక్షంలో అనుచరురాలిగా చేర్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. త్వరలో వైరాలో తన వర్గీయులతో పొంగులేటి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. అందుకు భారీగా జన సమీకరణ చేసే ఆలోచనలో ఆయన వర్గీయులు ఉన్నారు. అందుకే, విజయబాయి చేరిక కూడా సాదాసీదాగా నిర్వహించనున్నారు. చేరిక అనంతరం ఆదివారం వైరా నియోజకవర్గంలోని పలు మండలాల్లో జరిగే కార్యక్రమాలకు పొంగులేటితో కలిసి విజయబాయి హాజరు కానున్నారు.