ఫారెస్ట్ భూమిలో మట్టి రవాణా చేస్తున్న వాహనాలు సీజ్

by Kalyani |
ఫారెస్ట్ భూమిలో మట్టి రవాణా చేస్తున్న వాహనాలు సీజ్
X

దిశ,బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని రామాపురం అడవీ ప్రాంతంలో పోడు పట్టా భూముల హద్దులను కొన్ని రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. కాగా ఆ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ భూమి పోడుభూమిలో కలిపే విధంగా గత కొంతకాలంగా అక్రమార్కులు మట్టి రవాణా చేస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం అక్రమంగా ఫారెస్టులో మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు,ఒక జెసిబిని ఫారెస్ట్ అధికారులు పట్టుకొని రామాపురంలోని ఫారెస్ట్ నర్సరీకి తరలించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు సమాచారం అందించారు.

Next Story

Most Viewed