- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సుప్రీం కోర్టులో వనమాకి ఊరట
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి,కొత్తగూడెం : సుప్రీం కోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. తప్పుడు అపిడివిట్ దాఖలు చేశారంటూ ప్రత్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం వనమా వెంకటేశ్వరరావు పై అనర్హత వేటు విధించిన విషయం పాఠకులకు విధితమే. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వాదోపవాదాలు విన్న అనంతరం అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అనర్హత వేటుపై స్టే విధించడంతో వనమా వర్గీయులు సంబరాలు జరుపుకుంటున్నారు.
Next Story