- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆత్మీయ సమ్మేళనం లో బహిష్కృత నేత వనమా రాఘవ ప్రత్యక్షం

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యలకు కారణమైన ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్రరావు రామవరంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనానికి సెంట్రల్ అట్రాక్షన్ గా నిలిచాడు. పాల్వంచలోని రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల అనంతరం బీఆర్ఎస్ పార్టీ వనమా రాఘవేంద్రరావు పై బహిష్కరణ వేటు వేసింది. వనమా రాఘవ కొంతకాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో పార్టీ సమావేశాలకు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలలోనూ పార్టీ కార్యకలాపాలలోనూ దర్శనమిస్తున్నాడు.
సోమవారం రామవరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వనమా రాఘవేంద్రరావు పాల్గొని సెంట్రల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడి కి సన్మానాలు, గజ మాలలతో సత్కారాలు చేయడం చూసిన ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. నలుగురు ఆత్మహత్యలకు కారణమైన యువ నాయకుడిని పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పటికీ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో టీఆర్ఎస్ పార్టీ ఆ యువ నాయకుడిని మళ్లీ ఆహ్వానించిందా, పార్టీ ఆదేశాల మేరకే కార్యక్రమాలలో పాల్గొంటున్నాడా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.