వైరా ఎమ్మెల్యే ట్రెడిషనల్ లుక్

by Sridhar Babu |
వైరా ఎమ్మెల్యే ట్రెడిషనల్ లుక్
X

దిశ, వైరా : నిత్యం రాజకీయ ఒత్తిళ్లతో, నియోజకవర్గ పర్యటనలతో బిజీ బిజీగా గడిపే వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ బుధవారం ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. నిత్యం ఖద్దర్ చొక్కా పాయింట్ ధరించే ఎమ్మెల్యే తన జన్మదినం సందర్భంగా పంచ, కుర్తా (జూబ్బ), గోల్డ్ రంగు జరీ ఉన్న పై పంచ ధరించారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల కోసం ఎమ్మెల్యే రాములు నాయక్ సాంప్రదాయ దుస్తులు ధరించి నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్యేని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపించి నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు.



Next Story

Most Viewed