- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ కారులో ఏముంది..? పోలీసులను చూసి పరారైన దుండగులు

దిశ, కారేపల్లి : వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారును ఆపటానికి ప్రయత్నించగా కారును దుండగులు వదిలి పరారైన ఘటన కారేపల్లి మండలం సీతారాంపురం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం 9వ మైల్ తండా వద్ద ఇల్లందు పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం నుండి వస్తున్న కారును ఆపడానికి పోలీసులు ప్రయత్నించినా దుండగులు కారాపకుండా వేగంగా బారికేడ్లను దాటుకుంటూ వెళ్ళింది. అప్రమత్తమైన పోలీసులు ఆ కారును వెంబడించారు. వెంటనే ఇల్లందు స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేయగా వారు కరెంట్ ఆఫీస్ వద్ద మరో సారి కారును ఆపే ప్రయత్నం చేశారు. అయినా కారు అపకుండా ఖమ్మం వైపు దూసుకవెళ్ళింది. ఆ కారును వెంబడించే ప్రయత్నంలో ఇల్లందు పోలీసు వాహనం టైర్ పంచర్ అయింది. దీంతో ఇల్లందు పోలీసులు కారేపల్లి పోలీసులను అప్రమత్తం చేశారు. ఇల్లందు పోలీసులు మరో వాహనంలో కారు వెళ్ళిన వైపు వెంబడించగా కారేపల్లి మండలం సీతారాంపురం వద్ద దుండగులు కారును వదిలేసి పరారయ్యారు. కారు నుండి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మూడు బ్యాగులను వారితో తీసుకోని పరారైనట్లు సీతారాంపురానికి చెందిన వ్యక్తులు పోలీసులకు తెలిపారు. దుండగులు వదిలి వెళ్ళిన కారును తనిఖీ చేసిన పోలీసులకు దానిలో ఏమి కనిపించలేదు. దీనిపై పూర్తి విచారణ చేయనున్నట్లు తెలిపారు. కారును ఇల్లందు పోలీసులు స్వాధీనం చేసుకోని స్టేషన్‌కు తరలించారు.