జర్నలిస్ట్ ల ఆత్మ గౌరవానికి ప్రతీక టీ డబ్ల్యూ జె ఎఫ్

by Kalyani |
జర్నలిస్ట్ ల ఆత్మ గౌరవానికి ప్రతీక టీ డబ్ల్యూ జె ఎఫ్
X

దిశ, కారేపల్లి: జర్నలిస్టుల ఆత్మ గౌరవాన్ని పెంచేందుకే టీ డబ్ల్యూ జె ఎఫ్ (తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్) పనిచేస్తుందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించి, ఎన్నో విజయాలను సాధించడం టీడబ్ల్యూజెఎఫ్ తోనే సాధ్యమైందని సంఘం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం కారేపల్లి మండల పరధిలోని ఉసిరికాయలపల్లి శ్రీ కోట మైసమ్మ తల్లి ఫంక్షన్ హల్ లో జరిగిన టి డబ్ల్యూ జెఎఫ్ సభ్యత్వ కార్యక్రమం సింగరేణి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడెలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ నాయకులు, జర్నలిస్ట్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో, జిల్లాలో జర్నలిస్టుల సమస్యల కోసం, వారి హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ విజయాలు సాధిస్తున్న సంఘం టీడబ్ల్యూజెఎఫ్ సంఘం మాత్రమేనని అన్నారు.

ఈ సంఘం ద్వారా అనేక విజయాలు సాధించామని గుర్తు చేశారు. ముఖ్యంగా జర్నలిస్టుల ఇండ్లు, ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలు నిర్వహించి, అందులో విజయం సాధించామని తెలియజేశారు. అలాగే ఆర్టీసీ బస్సులో, ఏసీ బస్సులను జర్నలిస్టులకు సౌకర్యం కల్పించింది టీ డబ్ల్యూజెఎఫ్ అని గుర్తు చేశారు. జర్నలిస్టుల హెల్త్ విషయంలో కార్పొరేట్ వైద్యం తో పాటు, ప్రభుత్వ హాస్పిటల్ లో కూడా మెరుగైన వైద్యం చేయించడం కోసం సంఘం పోరాటం చేయడంతో, వారి పోరాట ఫలితంగా ప్రభుత్వం సిఫారసులు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరు ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించడం ఖాయమని, జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండాలని, ఒకే గొడుగు కిందకు రావాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయాన్నే పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.

ఈ సంఘం ఎల్లప్పుడూ మీకు తోడ్పాటు అందిస్తుందని, మండలంలోని నూతనంగా సభ్యత్వం తీసుకున్న వారికి టి డబ్ల్యూ జె ఎఫ్ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. కొత్తగా యూనియన్ లో చేరిన వారు మంచి నిబద్ధతో పనిచేసి సంఘానికి మంచి పేరు తేవాలని కోరారు. మీ అందరికీ తోడుగా ఉంటామని హామీ నిచ్చారు. టీడబ్ల్యూ జె ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం అహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. మండలంలో వివిధ పత్రికల్లో పని చేస్తున్న 10 మంది జర్నలిస్టులకు టీడబ్ల్యూజెఎఫ్ నూతన సభ్యత్వలను, జిల్లా నాయకత్వం అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు పాల్గొని సమాజంలో జర్నలిస్ట్ ల పాత్ర కీలకమని, ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధిగా జర్నలిస్ట్ లు పనిచేస్తు, సమాజంలో ఉన్న సమస్యలను వెలికితీస్తూనే, ఫోర్త్ ఎస్టేట్ గా జర్నలిస్ట్ బాధ్యతలు ఎనలేనివని వారు కొనియాడారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కోట మైసమ్మ ఆలయ చైర్మన్ పచ్చ పట్టాభి రామారావు, సీఐ తిరుపతి రెడ్డి, ఎస్సై రాజారాం, ఎంఈఓ జయరాజు, ఎంపీఓ రవీంద్ర ప్రసాద్, టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నాయకులు సయ్యద్ ఖదీర్, దువ్వా సాగర్, ఆవుల శ్రీనివాస్, వేగినాటి మాధవ్ రావు, కే. వెంకటేశ్వర్లు, రవికిరణ్, మండల జర్నలిస్ట్ లు రాంకిషోర్, అశోక్, సతీష్, భయ్యా నాగేశ్వరరావు, శంకర్, శ్రీనివాస్, నాగరాజు, రమేష్, చందు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed