- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్... రాజీనామా చేసిన నాగేశ్వరరావు
by S Gopi |

X
దిశ, ఇల్లందు టౌన్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఉన్న దిండిగల రాజేందర్ సహచరుడు, ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, ఆమె భర్త హరి సింగ్ నాయక్ ఆగడాలను తట్టుకోలేక కన్నతల్లి లాంటి పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుందని తెలిపారు. 2001 నుండి దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసం ఎన్నో కేసులలో జైలు జీవితం సైతం గడిపామన్నారు. ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్, భర్త హరి సింగ్ నాయక్ గార్ల మండలంలో తమని టార్గెట్ చేసుకుని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఎంతో బాధ కలిగిస్తుందని, అయినా తప్పక రాజీనామా చేయాల్సి వస్తుందని అన్నారు.
Next Story