- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుండాల మండలంలో పులి సంచారం
by Sridhar Babu |
X
దిశ, గుండాల : గుండాల మండలం దొంగతోగు అటవీ ప్రాంతంలో పులి సంచారంతో గుండాల మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే దొంగతోగు గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం చేల వద్దకు వెళ్లగా పులి గాండ్రింపులు విని రైతులు భయపడి ఇంటికి వచ్చారు.
ఇటీవల ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం నుండి పినపాక మీదుగా రెండు రోజుల క్రితం అడవిరామారంలో సంచరించిందని, తాజాగా దొంగతోగు గ్రామంలో పులి సంచారంతో వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా పులి పాదముద్రలు సేకరణ కోసం అటవీశాఖ అధికారులు దొంగతోగు కాటే ప్రాంతంలోని బర్లగుట్ట ప్రాంతంలోకి వెళ్లినట్టు సమాచారం.
Advertisement
Next Story