- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగ్గురు మావోయిస్టు కొరియర్, సానుభూతి పరుల అరెస్ట్
దిశ, భద్రాచలం : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్, సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం టౌన్ ఎస్ఐ మధు ప్రసాద్ సిబ్బందితో కలిసి ఆర్ టీ సీ బస్టాండ్ నందు తనిఖీలు చేస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతుండటంతో వారి వద్ద ఉన్న బ్యాగ్ లను పరిశీలించారు. బ్యాగ్ లలో విధ్వంసం సృష్టించడానికి ఉపయోగించే 6 బండిల్స్ కార్డెక్స్ వైర్,10 జిలెటిన్ స్టిక్స్, 5 డిటోనేటర్స్ 3 మొబైల్స్, మావోయిస్టు పార్టీ నోట్ షీట్స్ ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు గుంజి విజయ్,
బొంత నవీన్, భూక్యా నవీన్ లను పోలీస్ స్టేషన్ కి తరలించి ప్రశ్నించారు. తాము నిషేధిత మావోయిస్టు పార్టీ కొరియర్, సానుభూతి పరులుగా ఒప్పుకున్నారు. వీరిలో గుంజి విజయ్ 5 సంవత్సరాలుగా మావోయిస్టు కొరియర్ గా పనిచేస్తున్నాడని, బొంత నవీన్ మహబూబాబాద్ జిల్లాలో పేలుడు పదార్దాలు అమ్మే షాప్ యజమాని కాగా భూక్యా నవీన్ మధ్య వర్తిత్వం వ్యవహరించేవాడని పోలీసులు తెలిపారు. పేలుడు పదార్దాలను మావోయిస్టు లకు చేరవేయడానికి చర్ల మీదుగా ఛతీష్ ఘడ్ వెళ్లే ప్రయత్నంలో భద్రాచలం లో పట్టుబడ్డారు. మావోయిస్టులు అమాయక గిరిజనులను కొరియర్ లుగా ఉపయోగించుకుంటూ, వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారని,మావోల మాయమాటలు, బెదిరింపులకు లోనై విధ్వంసకర చర్యలకు పూనుకుంటే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏ ఎస్ పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.