నంది జాతీయ పురస్కారానికి తోటకూరి అంజమ్మ ఎంపిక

by Disha Web Desk 15 |
నంది జాతీయ పురస్కారానికి తోటకూరి అంజమ్మ ఎంపిక
X

దిశ, ఖమ్మం కల్చరల్ : మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి జిల్లా అధ్యక్షురాలు తోటకూరి అంజమ్మను తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారానికి ఎంపిక చేసినట్టు సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ పాలోజు రాజుకుమార్ చార్యులు, జాతీయ కన్వీనర్లు డాక్టర్ లక్ష్మీనరసింహమూర్తి రంగిశెట్టి రమేష్, బ్రహ్మశ్రీ డాక్టర్ వలబోజు మోహన్​రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ సాంస్కృతిక సాహిత్య నృత్య సమ్మేళనం-2023 సందర్భంగా ఎంపిక చేసినట్టు తెలిపారు. డిసెంబర్​ పదో తేదీన విజయవాడ బాలోత్సవ్ భవన్లో జరిగే సభలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేస్తారని తెలిపారు.

Next Story