- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పట్టువీడని విక్రమార్కుడు ఈ సాగరుడు

దిశ, వైరా : పోలీసులు.... ఈ మాట వింటేనే ప్రజల్లో వారిపై ఎంత నమ్మకం ఉంటుందో అంతే వారిపై కొంత తప్పుడు భావం ఉంటుందనేది నిజం. కేవలం వారి ఉద్యోగంతో మంచి ఎంత చేస్తారో అవకాశం వచ్చినప్పుడు అదే తప్పిదాలు చేస్తారనే నూన్యతా భావం ప్రజల్లో ఉంది. కానీ అలాంటి అపవాదులకు తోవ లేకుండా ప్రజల ధన,మాన ప్రాణాలను కాపాడేందుకు వైరా పోలీసుల విశేష కృషి చేస్తున్నారు. ఆ విషయంలో వైరా ఏసీపీ రెహమాన్ తో పాటు వైరా సీఐ నున్నావత్ సాగర్ ఎస్ఐలు కృషి చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఈనెల 12వ తేదీన వైరాలోని లీలా సుందరయ్య నగర్ లో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు వెంకటరామమ్మపై దాడి చేసి గుర్తు తెలియని నలుగురు దొంగలు సుమారు రూ .15 లక్షల విలువ చేసే 18 తులాల బంగారాన్ని అపహరించారు.
అయితే సీపీ సునీల్ దత్ ఆదేశాలతో వైరా ఏసీపీ రెహమాన్ పర్యవేక్షణలో వైరా సీఐ నున్నావత్ సాగర్ ఆధ్వర్యంలో ఎస్సైలు వంశీకృష్ణ భాగ్యరాజు, కొండలరావు, సూరజ్ నాలుగు బృందాలుగా ఈ కేసును ఛేదిస్తున్నారు. ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం నుంచి తమ కుటుంబాలను వదిలి నిద్రాహారాలను మాని ఈ కేసును ఛేదించటంలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే ఈ చోరీకి ఉపయోగించిన షిఫ్ట్ డిజైర్ వాహనం నెంబర్ ప్లేట్లోని కొన్ని అక్షరాలు కనపడకుండా పసుపు, కుంకుమతో ఉన్న గుడ్డను దొంగలు కట్టారు. దీంతో ఈ కేసును ఛేదించటం పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. దొంగలు ఆంధ్ర వైపు నుంచి కారులో చోరీకి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా చోరీ చేసిన అనంతరం దొంగలు ఖమ్మం వైపు కారులో పరారయ్యారు. అయితే వైరా సీఐ నున్నావత్ సాగర్ ఆధ్వర్యంలో ఇప్పటికే పోలీసులు విజయవాడ, హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం తదితర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
లింక్ సిసి ఫుటేజ్ ల ఆధారంగా పోలీసులు ఈ విచారణ చేయటం వల్ల కేసు పురోగతిలో కొంత ఆలస్యం జరుగుతోంది. అయితే సీఐ సాగర్ పట్టు వీడని విక్రమార్కుడిలా ఈ కేసును ఛేదించేందుకు పూర్తిస్థాయిలో తనకున్న అన్ని మార్గాల్లో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పటికే ఇద్దరు దొంగలు ఆనవాళ్లను పోలీసులు కనుగొన్నట్లు తెలిసింది. ఈ దొంగలను పట్టుకునెంతవరకు పోలీసులు వైరా తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఏసీపీ రెహమాన్ ఆదేశాల మేరకు సీఐ సాగర్ ఈ కేసును ఛేదిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో నిందితులను పట్టుకొని వైరా పోలీసులు తమపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా గత నాలుగు రోజులుగా కుటుంబాలను వదిలి తమ విధి నిర్వహణలో తిని తినక పనిచేస్తున్న వైరా పోలీసులు అభినందించాల్సిందే అని స్థానికులు వాపోతున్నారు.